Wednesday, March 20, 2019

తేయాంగ్‌కిమ్‌తో చీరాల క్రీడాకారులు….

ప్రకాశం చీరాల న్యూస్‌టుడే:
తైక్వాండో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో చైన్నైలో జయలలిత ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన తైక్వాండో సెకండ్‌ నేషనల్‌ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సుకు జిల్లా తరఫున ఆరుగురు ఎంపికై శిక్షణ పొందారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన తైక్వాండో బ్లాక్‌ బెల్టర్స్‌ వెంకటరమణ, సుబ్రహ్మణ్యం, సురేష్‌, నాగమల్లేశ్వరరావు, అంకరాజు, వెంకటఝాన్సీలక్ష్మికి జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శి శ్రీనివాసరావు, చెరుకూరి వెంకటరమణ అభినందనలు తెలిపారు. వీరికి కొరియన్‌ మాస్టర్‌ తేయాంగ్‌కిమ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారని తెలిపారు.

No comments:

Post a Comment