Friday, March 15, 2019

కొడుకు తో బంగార్రాజు కాంబో …..


సోగ్గాడే చిన్నినాయ‌న‌లో నాగ్ పాత్ర‌పేరు బంగార్రాజు గా  సినిమా మొత్తాన్నీ ఈ పాత్రే భుజాన వేసుకొని న‌డిపించేసింది. ఆ పేరుతోనే టైటిల్ న‌మోదు కూడా చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ టైటిల్‌ని న‌మోదు రిజిస్టర్ చేయించింది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది.జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బంగార్రాజు పాత్రకి భార్యగా రమ్యకృష్ణనే ఎంపిక చేస్తున్నారు. ఇక ఆయన మనవడిగా చైతూ కనిపించనున్నాడని అంటున్నారు. కాగా ఐతే ఇది కేవలం నాగార్జున సోలో సినిమా కాదు. ఇందులో నాగచైతన్య కూడా కనిపించబోతున్నాడు. నాగ్-చైతూ కాంబోలో రాబోతోంది బంగార్రాజు.

No comments:

Post a Comment