Friday, March 15, 2019

ఆనందపురంలో చోరీ………………..

శ్రీకాకుళం: న్యూస్‌టుడే,:
1)ఆనందపురం  గ్రామంలో  గురువారం వేకువజామున  చోరీ……..
2)దొంగలు నగదు, బంగారం అపహరణ……….
 జి.సిగడాం, మండలం ఆనందపురం  గ్రామంలో  గురువారం వేకువజామున  చోరీ జరిగింది.  పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం..  అనందపురం గ్రామానికి చెందిన  బిత్తిరి అప్పలనాయుడి రెండు  ఇళ్ళు  పక్కపక్క   ఉన్నాయి. రెండో  కుటంబసభ్యులు  నిద్రిస్తున్న సమయంలో గురువారం  తెల్లవారుజామున 4.30గంటల సమయంలో  దొంగలు  నగదు,  బంగారం అపహరణ  చేసినట్లు  తెలిపారు. బట్టలు చిందవందరగా  చేసి   సమీపంలో పడేశారు. బీరువాను  గ్రామానికి దూరంగా ఉన్న  బావిలో  పడేశారు. బీరువాలో ఉన్న రూ.20వేలు  నగదు, ఎనిమిది తులాల  బంగారం  అపహరణ  చేసినట్లు  పోలీసులు గుర్తించారు. సంఘటన  స్ధాలానికి  క్లూస్ టీంతో  పాటు  డాగ్ స్క్వాడ్   బృందం  చెరుకుని  పరిశీలించి  పలు  వివరాలు సేకరించినట్లు  వారు తెలిపారు. ఎసై జనార్ధనరావు ఈ విష్యమై కేసు నమోదు  చేసి  దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు.
                                                                                                డెస్క్:గౌస్& కోటి      

No comments:

Post a Comment