శ్రీకాకుళం:న్యూస్‌టుడే : ముఖ్యాంశాలు…..
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ ….
2.జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టు….
3.బస్సులోనే బస చేసిన చంద్రబాబు ….
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం రానున్నారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామిని ఉదయం దర్శించుకుని.. అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. తరువాత శ్రీకాకుళం వస్తారు. బహిరంగ సభ నిర్వహించే కోడిరామ్మూర్తి నాయుడు క్రీడా మైదానానికి చేరుకుంటారు. అప్పటికి సమయం సాయంత్రం 5.30 గంటలు కావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శ్రేణులకు వివరించనున్నారు. జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ఇప్పటికే తెదేపా ప్రణాళికలు రచించింది. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పాలకొండకు మాత్రమే అభ్యర్థి ప్రకటన మిగిలి ఉంది. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి చంద్రబాబు సభకు ప్రాతినిధ్యం ఉండేలా తెదేపా సన్నాహాలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,900 పైచిలుకు పోలింగు కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాల వారీ అధ్యక్షులున్నారు. వీరితో పాటు నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యేలా శ్రద్ధ వహిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూనరవికుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు గౌతు శిరీష సహా అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులు సభకు హాజరుకానున్నారు.

No comments:
Post a Comment