Friday, March 15, 2019

9 మంది భారతీయులు గల్లంతు….

ఢిల్లీ న్యూస్‌టుడే:
*న్యూజిల్యాండ్‌లో 9 మంది భారతీయులు గల్లంతు..
* అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది…
న్యూజిల్యాండ్‌లో 9 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత రాయబారి సంజీవ్‌ కొహ్లి చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్‌ ఇక్బాల్‌ జంగి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారంనాడు క్రిస్ట్‌ చర్చి ప్రాంతంలో రెండు మసీదుల్లో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మరణించిన విషయం విదితమే. అనేకమంది గాయపడ్డారు. వివిధ రకాలుగా సేకరించిన సమాచారాన్ని బట్టి 9 మంది భారతీయులు గల్లంతయ్యారని కొహ్లి అన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉందని కొహ్లి చెప్పారు.

No comments:

Post a Comment