హైదరాబాద్ న్యూస్‌టుడే:
- తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
- రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు.
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పదో పరీక్షలు వచ్చే నెల 3 వ తేదీ వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,563 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెన్త్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

No comments:
Post a Comment