Friday, March 8, 2019

ప్రచార హోరు..జోరు!


హైదరాబాద్ న్యూస్‌టుడే:
  • టి న్యూస్ 10 ఆన్ లైన్ ఎడిషన్
  • చేవెళ్ల లోగిలిలో రాహుల్‌-కేటీఆర్‌ నేడు పోటాపోటీ సభలు
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సమాయత్తమయ్యారు. శనివారం రాహుల్‌, కేటీఆర్‌లు చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అసెంబ్లి ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్‌ గాంధీ తిరిగి రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. బూత్‌స్థాయి పార్టీ నేతలు, ముఖ్యులతో ఆయన సమావేశమై లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, భువనగిరి, మెదక్‌, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే స్థానికంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాల్లో పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే 16 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న తెరాస ఆ దిశగా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులను కోరుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఇతరర ముఖ్య నేతలో కేటీఆర్‌ మమేకమవుతూ భారీ మెజారిటీతో లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని ఇందుకు ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పని చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment