కర్నూలు న్యూస్‌టుడే:
సమాజంలో కొన్ని మేధావి వర్గాలు ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నాయని, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని స్వీప్ జిల్లా నోడల్ అధికారి నాగరాజు నాయుడు అన్నారు. బుధవారం వైద్య కళాశాలలోని ఓల్డ్ సీఎల్‌జీలో (సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రికల్ పార్టిసిపేషన్) స్వీప్ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు నాయుడు మాట్లాడుతూ.. 2014 ఎన్నికలలో కర్నూలు నియోజకవర్గంలో కేవలం 58 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటింగ్ నమోదైందని, అక్షరాస్యత కలిగిన మేధావి వర్గాలు ఓటుకు దూరం అవుతున్నారన్నారు. ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ ఎన్నో సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. 18 సంవత్సరాలు వయస్సు నిండి ఓటరుగా నమోదు చేసుకున్న వారందరూ ఓటు వేయాలని సూచించారు.
No comments:
Post a Comment