విశాఖ న్యూస్‌టుడే:
*కాంగ్రెస్ పార్టీ నాయకులు పరుచూరి భాస్కరరావు జనసేన పార్టీలో చేరారు…
*ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ను కలసిన ఆయన జనసేన కండువా కప్పుకొని పార్టీలో చేరారు…
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరుచూరి భాస్కరరావు జనసేన పార్టీలో చేరారు. విజయవాడలో ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ను కలసిన ఆయన జనసేన కండువా కప్పుకొని పార్టీలో చేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడైన భాస్కరరావు ఆయనతో విభేదించి బయటకు వచ్చారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులను అనకాపల్లి రప్పించి ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి పార్టీలో చేరారు. నియోజకవర్గంలో పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు జనసేనలో పార్టీలో చేరారు. అనకాపల్లి జాతీయరహదారిలో నూతనంగా ఏర్పాటుచేసిన కార్యాలయానికి ఆయన సోమవారం రానున్నట్లు ఇక్కడ సిబ్బంది తెలిపారు.

No comments:
Post a Comment