చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……
*పలమనే రులో జగన్ బహిరంగ సభ…..
‘వైకాపా అధికారంలోకి రాగానే జగనన్న నవరత్నాలను తీసుకొస్తాడని చెప్పండి చంద్రబాబు ఇచ్చే డబ్బులు చెప్పే మాటలు నమ్మొద్దని ప్రజలకు వివరించండి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యకర్తల ముందున్న లక్ష్యమ’ంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పలమనేరు టవర్‌క్లాక్ సెంటర్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను, పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటేగౌడను ప్రజలకు పరిచయం చేసి వారిని ఆశీర్వదించాలని కోరారు. ఉదయం నుంచే నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు జన సమీకరణ చేశారు. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైవేపై జగన్ సభ నిర్వహించాల్సి ఉండగా నెల్లూరు జిల్లా కావలిలోనే ఆ సమయం గడిచిపోయింది. సాయంత్రం 4 గంటలకు సభాస్థలికి వచ్చిన జగన్ నేరుగా ప్రచారరథంపైకి ఎక్కి ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా పలమనేరు అభ్యర్థి వెంకటేగౌడ జగన్‌కు స్థానిక సమస్యలను చదివి వినిపించారు. వాటిని అధికారంలోకి రాగానే తీర్చాలని కోరారు. అనంతరం జగన్ ప్రసంగిస్తూ గత 20 రోజులుగా చంద్రబాబు ఉన్నవి లేనట్లుగా ఉన్నవి లేనుట్లుగా ప్రచారం చేస్తున్నారని, ఈ డ్రామాలను ప్రజలంతా చూస్తున్నారంటూ పలు వ్యాఖ్యలు చేశారు. అన్యాయాలు, మోసాలు, దుర్మార్గాలతోనే ఐదేళ్లుగా పాలన సాగిస్తున్నారని, జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్ఛి. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పేదలకు అండగా ఉండేలా తాము నవరత్నాలను ప్రకటించామని, వాటిని అధికారంలోకి వస్తే పక్కాగా అమలు చేస్తామని జగన్ హామినిచ్చారు.

No comments:
Post a Comment