ఒంగోలున్యూస్‌టుడే:
‘దర్శి నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారు. మళ్లీ మీరే పోటీ చేయాల’ంటూ తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావును కోరారు. తెదేపా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా శిద్దా రాఘవరావును పోటీ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి… దర్శి నియోజకవర్గానికి చెందిన సుమారు రెండు వేల మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఒంగోలులోని రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు నివాసానికి చేరుకున్నారు. ఎంపీగా మీరు పోటీ చేస్తున్నట్లు సమాచారం అందింది, దీనిపై మాట్లాడేందుకు వచ్చాం. అవసరమైతే చంద్రబాబునైనా కలుస్తాం. దర్శి నుంచి మీరే పోటీ చేయాలని పట్టుబట్టారు. మీరు కాకుంటే మీ కుటుంబ సభ్యులైనా సరే పోటీ చేయాలి. లేకుంటే పార్టీకి దూరంగా ఉంటామని ఆ నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి తన వెంట పురుగు మందు డబ్బా తీసుకువచ్చినట్లు గమనించి స్థానికులు లాక్కున్నారు.

No comments:
Post a Comment