Saturday, March 9, 2019

వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి…

ఒంగోలు కర్నూలురోడ్డు, న్యూస్‌టుడే:
  • పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి అన్నారు.
  • మార్చి 10, 11, 12వ తేదీలలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఒంగోలు ప్రకాశం భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.
  • వైద్య ఆరోగ్యశాఖ తరఫున పోలియో చుక్కలు వేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
  • అయిదు సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా చుక్కలను వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
  • పోలియో బారిన ఎవరూ పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.
  • కార్యక్రమంలో ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment