Saturday, March 16, 2019

యువకులు కత్తులతో చెలగాటం…….

కర్నూలు న్యూస్‌టుడే:
 ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.. నంద్యాలలో యువకులు కత్తులతో చెలగాటం ఆడుతున్నారు. యువత కత్తులతో దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు నిఘా ఏ మాత్రం కనిపించడం లేదు. నంద్యాలలో శనివారం రాత్రి ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. నంద్యాల రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బండిఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామానికి చెందిన నబిషా కుమారుడు కుద్దూస్‌ (22)తో కలిసి పచ్చి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. శనివారం మిత్రులతో కలిసి సాయిబాబానగర్‌లోని బొల్లపు వైన్‌ దుకాణంలో మద్యం తాగుతున్న సమయంలో కుద్దూస్‌పై మిత్రులు కత్తులతో దాడి చేశారు. కత్తి పోట్లతో మద్యం దుకాణం నుంచి బయటకు వచ్చిన కుద్దూస్‌ వందలాది మంది చూస్తుండగానే సుమారు 20 నిమిషాలపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలాడు. స్థానికులు కొంత మంది వెంటనే రిక్షాలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మద్యం దుకాణంలో ఉండే సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ మేరకు వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

No comments:

Post a Comment