Saturday, March 16, 2019

ఇది పోలీసులు వైఫల్యమే…


కర్నూలు,న్యూస్‌టుడే: 
  • ప్రజాదరణ తగ్గడంతోనే దాడులకు పాల్పడుతున్నారు బాధ్యులపై చట్టపరమైన చర్యలు అవసరం
  • తిక్కారెడ్డిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..
మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డిని శనివారం హైదరాబాదు తరలించే సమయంలో ఆసుపత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన సమయంలో తనను రక్షించేందుకు గన్‌మెన్‌లు కాల్పులు జరిపారన్నారు. ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని, ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారని, రౌడీలను బైండోవర్‌ చేయలేదని విమర్శించారు. దాడి జరిగిన సమయంలో తన వద్ద ఏఎస్సై మాత్రమే ఉన్నారని, ఆయన వద్ద ఆయుధాలు లేవన్నారు. ప్రత్యర్థులకు ప్రజాదరణ తగ్గటంతోనే వారు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రదీప్‌రెడ్డి, అతని వర్గీయుల వద్ద ప్రైవేటు ఆయుధాలు ఉన్నాయని, వారు కాల్పులకు పాల్పడ్డారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాక బెదిరింపులతో గెలిచేందుకు యత్నిస్తున్నారన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
          

No comments:

Post a Comment