రాచర్ల, గిద్దలూరు న్యూస్‌టుడే :
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2. ఏటీఎంలో రూ.11 వేలు డ్రా చేసినట్లు.
2. ఏటీఎంలో రూ.11 వేలు డ్రా చేసినట్లు.
ఏటీఎం కార్డు మార్చి రూ.11 వేలు నగదు డ్రా చేసిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు. రాచర్లకు చెందిన ఎన్.నాగయ్య నగదు అవసరం కావడంతో గిద్దలూరు గణేష్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రానికి వెళ్లారు. అక్కడ యంత్రంలో ఏటీఎం కార్డు పెట్టగా… ఇరుక్కుపోయింది. ఈ సమయంలో కేంద్రం లోపలికి వచ్చిన ఓ వ్యక్తి తాను కార్డు తీస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే తన వద్దనున్న అన్నపురెడ్డి తిరుపతిరెడ్డి అనే పేరున్న కార్డును నాగయ్య చేతిలో పెట్టాడు. కార్డు మారిపోయిందని గుర్తించిన నాగయ్య… అప్రమత్తమయ్యేలోపు బయటకొచ్చి ద్విచక్ర వాహనంలో వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే మరో ఏటీఎంలో రూ.11 వేలు డ్రా చేసినట్లు బాధితుని చరవాణికి సందేశమొచ్చింది. దాంతో బాధితుడు బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసి, తన నంబరును బ్లాక్ చేయించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

No comments:
Post a Comment