Thursday, March 7, 2019

బజారులో భారీగా గుట్కా ప్యాకెట్లు నిల్వ…..

ఒంగోలు న్యూస్‌టుడే:
1.టీన్యుస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2.రూ.9.37 లక్షలు విలువగల గుట్కా ప్యాకెట్లు పట్టివేత .
ఒంగోలు నగరంలో అక్రమంగా నిల్వ చేసిన పొగాకు ఉత్పత్తులను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సివిల్‌ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. స్థానిక లాయర్‌పేట సాయిబాబా గుడి ఎదురు వీధిలోని హరేరామ బజారులో భారీగా గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారన్న సమాచారంతో ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారిణి ఎం.రజని ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు బి.టి.నాయక్‌, కె.వి.రాఘవేంద్ర, ఒంగోలు ఒకటో పట్టణ ఎస్‌.ఐ వి.సుమన్‌ తమ సిబ్బందితో దాడి చేశారు. స్థానికంగా ఓ గదిలో అమరా బాలకృష్ణ అనే వ్యక్తి వీటిని నిల్వ చేసినట్లు గుర్తించారు. అనంతపురం జిల్లాకు చెందిన సరఫరాదారు ద్వారా ఇతను వీటిని బుధవారం రాత్రి డీసీఎం వాహనంలో ఒంగోలు తరలించినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పట్టుబడిన సరకు విలువ రూ.9.37 లక్షలుగా తెలిపారు. నిందితుడు గతంలో ఇదే తరహా కేసులో పట్టుబడటం గమనార్హం. ఈ దాడుల్లో విజిలెన్స్‌ ఎస్‌.ఐ. అహ్మద్‌ జానీ, ఆడిటర్‌ శ్యామ్‌ పాల్‌, ఒకటో పట్టణ హెడ్‌ కానిస్టేబుల్‌ సీతారామయ్య, విజిలెన్స్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
                                    

No comments:

Post a Comment