తరకటూరు(గూడూరు),న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు.
3. నీరు నింపేందుకు ఏర్పాటు చేసిన మోటార్లను పరిశీలించారు
జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గూడూరు మండలంలోని తరకటూరు సావహిక రక్షిత నీటిపథకం చెరువులో నీరు నింపుతున్న తీరును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన బందరుకాలువ నుంచి చెరువులోకి నీరు నింపేందుకు ఏర్పాటు చేసిన మోటార్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తిస్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు ప్రధాన కాల్వలకు నీరు విడుదల చేశామని చెప్పారు. నీటిపారుదల, గ్రామీణ నీటిసరఫరా విభాగ అధికారులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా అన్ని తాగునీటి చెరువులను నింపేలా కృషిచేస్తున్నామన్నారు. బందరు, పెడన, గూడూరు మండలాలతోపాటు పెడన, మచిలీపట్నం పట్టణాల ప్రజలు తరకటూరు చెరువుపై ఆధారపడతారని, అందుకే ఈ చెరువును పూర్తిస్థాయిలో నింపేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. చెరువు నీటిమట్టం 5.19 మీటర్లకు గానూ ఇప్పటివరకు 3.20 మీటర్లు నింపామని చెప్పారు. రామరాజుపాలెం కాలువతోపాటు అన్ని కాలువల శివారు ప్రాంతాల వరకు నీరు అందించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామనీ, చెరువు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ డీ.సాయినాథ్, ఈఈ చంద్రశేఖరరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment