చోడవరం,విశాఖ న్యూస్‌టుడే: ఇప్పటి వరకు ‘వీడుతేడా’,’బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ,’లండన్‌బాబూ,అనే మూడు సినిమాకు దర్మకత్వం వహించానని దర్మకుడు భీమరశెట్టి శ్రీనివాసరావు అలియాస్ చిన్నికృష్ట పేర్కొన్నారు. ఆదివారం చోడవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ 200 లకు పైగా నాటికకాలు, నాటకాల్లో నటించానని తెలిపారు. 2013లో సినిమాల్లో అడుగు పెట్టినట్లు చెపారు. డైరెక్టర్ వి.వి. వినాయిక్ వద్ద సహాయకునిగా పనిచేశానని అన్నారు. ప్రస్తుతం అక్షర సినిమాకు దర్మకత్వం వహిస్తున్నట్లు చెపారు. తన స్వగ్రామం విశాఖ నగరంలోని కంచరపాలెం అని తెలిపారు. అక్షర సినిమాలో నుతన నటీమణులను పరిచయం చేస్తున్నానని, ప్రైవేటు విద్యాసంస్థల కంటే ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకు ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో హాస్య ప్రధాన్య సిన్ సిమాలు తీయాలని భావిస్తున్నట్లు చిన్నికృష్ట చేప్పారు.

No comments:
Post a Comment