Sunday, March 10, 2019

బిడ్డలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య……


పోతుమర్రు:కలిదిండి కైకలూరు, న్యూస్‌టుడే: 
1.టీఅన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ …..
2. :కన్నతల్లే కన్నబిడ్డలకు విషమిచ్ఛి…..
3. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కన్నతల్లే కన్నబిడ్డలకు విషమిచ్ఛి. బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం కృష్ణాజిల్లా కలిదిండి మండలంలోని పోతుమర్రు శివారు గొల్లగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లగూడేనికి చెందిన కట్టా త్రివర్తులతో గుడివాడ మండలం బేతవోలు గ్రామానికి చెందిన అశ్విని (29)కి అయిదేళ్ల కిందట వివాహమైంది. వారికి కుమార్తె శర్వాణీప్రియ (5), కుమారుడు కిరణ్‌తేజ (2) పుట్టారు. మొదటి నుంచి అత్తింటివారితో స్వల్ప విభేదాలు ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ పెద్దగా లేవు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం కూర తాలింపు మాడిందని భర్త గట్టిగా కేకలు వేయడంతో అశ్విని మనస్తాపానికి గురైనట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. సున్నిత మనస్కురాలైన ఆమె ఆ బాధను దిగమింగుకోలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్ఛి. తాను కూడా తాగేసింది. ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కైకలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అశ్విని, కిరణ్‌తేజలు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాణాలతో పోరాడుతున్న శర్వాణీప్రియని మెరుగైన వైద్యం నిమిత్తం తండ్రి త్రివర్తులే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. తల్లి, పిల్లల మృతి సమాచారంతో డీఎస్పీ పి.మహేష్‌ కైకలూరు ఆసుపత్రికి చేరుకుని సీఐ రవికుమార్‌తో కలిసి వివరాలు సేకరించారు. కోడలు ఆత్మహత్య సంఘటనతో హతాశులైన అత్త అలివేలు మంగ, మామ వెంకటేశ్వరరావు, అశ్విని కుటుంబ సభ్యులు కైకలూరు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపిస్తున్నారు.

No comments:

Post a Comment