Wednesday, March 13, 2019

కన్న తల్లే కడతేర్చింది…

చిత్తూరు న్యూస్‌టుడే: 
  • బిడ్డను నీళ్ల డ్రమ్ములో పడేసి చంపేశారని గగ్గోలు పెట్టిన తల్లి
  • తల్లే చంపి ఇతరులపైకి నెట్టిన వైనం
చిత్తూరు జిల్లా  శ్రీరంగరాజపురం మండలంలోని కొత్తపల్లిమిట్ట పరిధి పిల్లిగుండ్లపల్లి దళితవాడలో ఫిబ్రవరి 26న ఐదునెలల పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే.పుత్తురు డిఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో కార్వేటినగరం సీఐ చల్లనిదొర కేసు నమోదు చేశారు.తమకు కానివారు ఎవరో తన బిడ్డను నీళ్ల డ్రమ్ములో పడేసి చంపేశారని గగ్గోలు పెట్టిన తల్లి భువనేశ్వరి తన పిల్లల ఆలనా పాలనకు పుట్టింటికి వెళ్లిన తరువాత భర్త వినోద్ సరిగ్గా చూసుకోవడం లేదని,పుట్టింట్లోని వారి పేదరికం,ఇతర కారణాలతో పసి బిడ్డను చంపి ఇతరులపైకి నెట్టేయాలనుకుంది.విషయం తెలుసుకున్న పోలీసులు భువనేశ్వరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

No comments:

Post a Comment