Wednesday, March 13, 2019

మద్యం అక్రమ నిల్వలపై నిఘా….

గుంటూరు న్యూస్‌టుడే:
*ఎక్సైజ్ కంట్రోల్ రూమును పరిశీలన.
*మద్యం స్టాక్ ను పరిశీలన. 
*మద్యం పంపిణీ కాకుండా తగిన చర్యలు.
ఎన్నికల సందర్భంగా ఎక్సైజ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమీషన్ చంద్రశేఖర్ నాయుడు ఆదేశించారు. బుధవారం గుంటూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమును ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌నాయుడు మాట్లాడుతూ.. మద్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా వుంచాలని చెప్పారు. జిల్లాలోని అన్ని వైన్ షాపులను నిత్యం తనిఖీ చేసి స్టాకును పరిశీలించాలన్నారు. ఎక్సైజ్ శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి వెలువడనున్న కరపత్రాలు, పోస్టర్లు, వాల్‌పేపర్ల ద్వారా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఎన్నికల్లో నిబంధనలను ఉల్లంఘించిన మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమును తనిఖీ చేసి నిరంతరం ఫిర్యాదులు స్వీకరించాలని, వారి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమలో డీసీఎం ఆదిశేషు, ఎంఫోర్స్‌మెంట్ ఏపీ శ్రీనివాసులు, ఈ ఎస్ లు బాలకృష్ణన్ (గుంటూరు), రవికుమార్ (తెనాలి) మహేష్ కుమార్ నరసరావుపేట సీఐ విజయ్ కుమార్, ఎస్ ఐలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment