Wednesday, March 13, 2019

పరిశీలన పరిధిలో వున్న రైల్వేస్టేషన్…


గుంటూరు న్యూస్‌టుడే:
*రైల్వే డబ్బింగ్ ప్రాజెక్ట్ ఇన్‌స్పెక్షన్ కార్యక్రమం.
*ప్లాట్‌ఫారం నెంబర్ 1 కి చివరి భాగాన పూజ.
*ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించుట.
తెనాలి రైల్వే డబ్బింగ్ ఇన్స్‌పెక్షన్ కార్యక్రమం తొలిరోజు పూర్తి అయింది. రైల్వే బోర్డ్ నుంచి వచ్చిన కమీషనర్ ఆఫ్ సేఫ్టీ విభాగం అధికారులు షెడ్యూల్ ప్రకారం ఇన్స్‌పెక్షన్ నిర్వహించారు. బుధవారం ఉదయం 9 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నెంబర్ 1కి చివరి భాగాన పూజ చేసి ఇన్స్‌పెక్షన్ ప్రారంభించారు. గుంటూరు నుంచి మిక్స్ క్యాబిన్ వరకు తొలిత మోపడ్స్‌తో పరిశీలించారు. ఆ తర్వాత న్యూమిక్స్ కేబిన్ ను పరిశీలించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మోటార్ ట్రాలీలు టవర్ కార్ తో న్యూమిక్స్ కేబిన్ నుంచి వేజెండ్ల వరకు ఇన్స్‌పెక్షన్ చేశారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం వేజెండ్ల రైల్వేస్టేషన్ తనిఖీ చేశారు. అక్కడ కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. సాయంత్రం 4 గంటల నుంచి సీ ఆర్ ఎస్ స్పెషల్ తో బ్రయల్‌రన్ నిర్వహించారు. రాత్రి 9 గంటల వరకు స్పీడ్ టెస్టు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తొలిరోజు ఇన్స్‌పెక్షన్ రైల్వే కమీషనర్ ఆఫ్ సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికార మార్గాలు తెలిపాయి. విద్యుద్దీకరణలో గుంటూరు-తెనాలి రైల్వేస్ డబుల్ లేస్ ఎంతో పఠిష్టంగా  నిర్మిచినట్లు ఆర్‌వీఎస్ఎస్ వర్గాలు చెప్పాయి.

No comments:

Post a Comment