సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కథనాయకుడిగా “నేను శైలజ” ఫేమ్ కిశోర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మువీ మేకర్స్ నిర్మిస్తున్న తాజ చిత్రం “చిత్రలహరి”. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రంలోని పాత్రలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ టీజర్ ను వదిలారు.ఇక ఈ మువీలో సాయిధరమ్ తేజ్ కు జోడిగా కల్యాణీ ప్రియదర్శిన్,నివేథ పేతురాజ్‌లు నటిస్తున్నారు.రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇటీవల వరుస పరాజయాలతో కెరీర్ ను ప్రశ్నార్థకంగా మార్చుకున్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమతో తిరిగి సక్సెస్ బాటపట్టాలని చూస్తున్నాడు.డైరెక్టర్ కిశోర్ తిరుమల చొవరి చిత్రం “ఉన్నది ఒకటె జిందగీ” కూడా ఆశించినస్థాయిలో విజయం సాధించలేదు. ఆయన కూడా “చిత్రలహరి” పై భారీ ఆశలే పెట్టుకున్నారు.ఇద్దరికీ ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.

No comments:
Post a Comment