Wednesday, March 13, 2019

ఎన్నికల నేపథ్యం లో గ్రామాలలో అల్లర్లకు చెక్ …..

నందికొట్కూరు న్యూస్‌టుడే:
  • అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
  • 771 మద్యం సీసాలు, 113 తుపాకులు స్వాధీనం
  • 872 మందిపై బైండోవర్‌ నమోదు
ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శిక్షణ ఏఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన ఓ ఇంటిపై దాడి చేసి 771 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మాదిరెడ్డి సూర్యనారాయణరెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. డివిజన్‌ పరిధిలో 121 లైసెన్స్‌ తుపాకులు ఉండగా 113 మంది స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగతా 8 తుపాకులు బ్యాంకు సెక్యూరిటీ వద్ద ఉన్నాయన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఆయా పోలీస్‌ పరిధిలోని ఎస్సైలు తమ సిబ్బందితో కలసి గ్రామాలకు వెళ్లి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 872 మందిపై బైండోవర్‌ నమోదు చేసినట్లు చెప్పారు. పాములపాడు మండలం భానుముక్కల, నందికొట్కూరు మండలం మార్కెట్‌ యార్డు వద్ద కేజీ రహదారిపై, రాష్ట్ర సరిహద్దులైన శాతనకోట, మూర్వకొండ, కపిలేశ్వరం వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నందికొట్కూరు అబ్కారీ సీఐ సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment