కృష్ణంశెట్టిపల్లె,న్యూస్‌టుడే:
ఓ సైనికోద్యోగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. - కంభం మండలం తురిమెళ్లకు చెందిన నందవరం రంగసుబ్బయ్య కుమారుడు నందవరం రాఘవేంద్ర(27) ఆరేళ్లుగా సైన్యంలో పని చేస్తున్నారు.
- కొమరోలుకు చెందిన శ్రీవిద్యతో ఏడాది కిందట వివాహం జరగ్గా- ఆమె ప్రస్తుతం విశాఖపట్నంలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది.
ఇటీవల రాఘవేంద్ర సెలవులపై ఇంటికొచ్చారు.శుక్రవారం స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరారు.సాయంత్రానికి తండ్రికి పక్షవాతం రాగా- బంధువులు గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.రాఘవేంద్రకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు.తాను నంద్యాలలో ఉన్నానని, వెంటనే బయల్దేరుతున్నానని సమాధానమిచ్చారు.తరువాత రాఘవేంద్ర ఫోన్ పని చేయలేదు.శనివారం ఉదయం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె పంచాయతీ దిగువమెట్ట సమీపంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి స్టేషన్ మాస్టర్ లక్ష్మయ్యకు సమాచారం ఇచ్చారు.ఆయన నంద్యాల జీఆర్‌పీఎఫ్ పోలీసులకు తెలియజేశారు.సంఘటన స్థలాన్ని పరిశీలించగా-మృతదేహం వద్ద వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌నోట్ లభ్యమైనట్లు కానిస్టేబుల్ మద్దయ్య తెలిపారు.జీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం,తండ్రికి పక్షవాతం రావడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

No comments:
Post a Comment