కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్దానికి బయల్దేరాడు తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికి, రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు.కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాతూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి.దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయలుదేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులు అంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది. శూరపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్కోనే ప్రయత్నం చేశాడు. ఆ షణ్ముఖుని కంటి నుంచి తన వేలాయుద్ధముతో ఆ మామిడి చెట్టుని రెండుగా చీల్చాడట. దాంతో చెట్టు సగభాగం నెమలిగానూ. రెండో సగం కోడిపుంజుగా మారిపోయాయి. నెమలిని తన వాహనంగానూ, కోడిపుంజుని తమ ధ్వజంగానూ మార్చుకున్నాడు.

No comments:
Post a Comment