Thursday, March 7, 2019

మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు…

ఢిల్లీ న్యూస్‌టుడే:
*మహిళలకు పెద్దపీట…
*రైల్వే స్పెషల్ ఫోకస్  ప్రత్యేక సౌకర్యాలు…
 మహిళా దినోత్సవం సందర్భంగా ..రైల్వే అధికారులు సరికొత్త నిర్ణయంతీసుకున్నారు.మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు.ప్రత్యేక రిజర్వేషన్ కొటా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.58 సంవత్సరాలు నిండిన మహిళలకు చార్జీలో 50శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు.లాంగ్‌జర్నీ రైళ్లల్లో లగేజ్ కమ్ గార్డ్ కోచ్ వెంబడి స్పెషల్ గా మహిళా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.బుకింగ్ కార్యాలయాలతో పాటు రిజర్వేషన్ కౌటర్లలో మహిళల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
                        

No comments:

Post a Comment