Thursday, March 21, 2019

‘తుగ్లక్‌’ దండయాత్ర……..


న్యూస్‌టుడే:
‘118’ విజయం కల్యాణ్‌ రామ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.  ఇప్పుడాయన వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు  చేస్తున్నారు. కొత్త కథలు వింటున్నారు. నూతన దర్శకుడు వేణు మల్లిడి కథకు కల్యాణ్‌ రామ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘తుగ్లక్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో నడిచే కథ ఇది. కల్యాణ్‌ రామ్‌ పాత్ర కొత్త పంథాలో సాగుతుందని సమాచారం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలో కల్యాణ్‌ రామ్‌ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించనున్నారు. స్క్రిప్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. మేలో చిత్రీకరణ మొదలుపెడతారు. కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

No comments:

Post a Comment