బాలీవుడ్ న్యూస్‌టుడే:మల్టీ స్టారర్‌కి సంబంధించి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో మలయాళంలో మంచి విజయం సాధించిన విలన్ అనే మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌ని తెలుగులో పులి జూదం పేరుతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. మార్చి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. తెలుగులో మోహన్‌లాల్‌తో పాటు విశాల్, హన్సిక, శ్రీకాంత్, రాశీ ఖన్నాకి మంచి క్రేజ్ ఉండడంతో ఈ చిత్రానికి ఆదరణ కూడా బాగా లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

No comments:
Post a Comment