పశ్చిమగోదావరి న్యూస్‌టుడే:
- జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్..
- ప్రతి నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి …
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. అధికారుల ఉరుకుల పరుగులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నచ్చిన వ్యక్తికి వేసుకోవడానికి అధికారుల పాత్ర కీలకమైనది. భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఎన్నికల ప్రకటన వచ్చిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అధికారులంతా ఎన్నికల సంఘం కింద పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎందరో అధికారుల శ్రమ దాగి ఉంటుంది. అన్నివర్గాల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా వ్యహరించాలి. ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.శాసనసభల ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది.

No comments:
Post a Comment