Wednesday, March 20, 2019

ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ 54 కేంద్రాలను సందర్శించగా..

ప్రకాశం   న్యూస్‌టుడే: 
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో భాగంగా మంగళవారం నిర్వహించిన తెలుగు-2 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 167 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 40,346 మందికి గాను 40,179 మంది(99.58 శాతం) హాజరయ్యారు. ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ 54 కేంద్రాలను సందర్శించగా, డీఈవో వీఎస్‌ సుబ్బారావు గుంటూరు ఆర్జేడీతో కలిసి గురుదత్త, ప్రతిభ జూనియర్‌ కళాశాల, ఒంగోలు సెయింట్‌ జేవియర్‌, ఏపీఆర్‌ఎస్‌ సంతనూతలపాడు, జీహెచ్‌ఎస్‌ చీమకుర్తి, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ చీమకుర్తి కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు. 

No comments:

Post a Comment