Sunday, March 17, 2019

హిట్ కొట్టడం ఖాయం…..

  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఈ నెలలోనే పట్టాలెక్కనుంది.
  • మొదట ఒక బాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది.
  • అయితే ఆ కథ కాదని సొంత కథతో త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.
కొత్త కథ కావడం వల్లే సినిమా ఆలస్యమవుతోందని అంటున్నారు. ఈ సినిమాతో బన్నీ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని మెగా వర్గాల వారు చెబుతూ వస్తున్నారు. ఎట్టకేలకు స్క్రిప్ట్ సిద్ధమైందని… ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది.త్రివిక్రమ్ తనదైన శైలిలో స్క్రీన్‌ప్లేను రూపొందించారని… ఇందులో ఆయన మార్క్ కామెడీ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ చిత్రానికి ‘నేను నాన్న’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తండ్రి, కొడుకు సెంటిమెంట్‌తోనే ఈ చిత్రం ఉంటుందని సమాచారం. సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో తండ్రికి ఎంతో గౌరవం ఇచ్చే కొడుకుగా హీరో పాత్ర ఉంటుందని… అందుకే ఈ చిత్రానికి ‘నేను నాన్న’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు.

No comments:

Post a Comment