Sunday, March 17, 2019

కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు ………


విశాఖ న్యూస్‌టుడే:
  • జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ అనకాపల్లిలో జరిగిన ఓ వేడుకకు వెళ్లి గాజువాక వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు దాటుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన లారీ క్లీనర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ (47)ను ఢీకొట్టడంతో అతని తలకు తీవ్ర గాయమైంది…
  • కూర్మన్నపాలెం జాతీయ రహదారి సమీపంలోని కుంచమాంబ అమ్మవారి గుడివద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్‌ ఒకరు త్రీవంగా గాయపడ్డారు. దువ్వాడ ఎస్సై అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం…
జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ అనకాపల్లిలో జరిగిన ఓ వేడుకకు వెళ్లి గాజువాక వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు దాటుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన లారీ క్లీనర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ (47)ను ఢీకొట్టడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన కారులోనే అగనంపూడి ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో గాజువాకలోని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు నిరాకరించడంతో నగరంలోని కేర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు, డ్రైవింగ్‌ చేస్తున్న కో డైరెక్టర్‌ మన్నవ అరుణ్‌ గౌతమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్మీని వేరే కారులో పంపించేశారు.
                         

No comments:

Post a Comment