హైదరాబాద్: న్యూస్‌టుడే:
- ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తోన్న అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో సేవలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్ స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు…
- ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు…
- ఐటీ ఉద్యోగులకు ఎంతో ఊరట లభించింది.
ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తోన్న అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో మార్గం బుధవారం అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్ స్టేషన్‌లో జెండా ఊపి మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు.

No comments:
Post a Comment