మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్‌తో కలిసి గోపాల గోపాల లాంటి చిత్రాలు చేసి టాలీవుడ్‌లో మల్టిdస్టారర్‌లకు చిరునామా అయ్యారు విక్టరీ వెంకటేష్. ఈ అగ్ర హీరో త్వరలో మరో రెండు మల్టిdస్టారర్ చిత్రాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి బాలీవుడ్‌లో కాగా… మరొకటి నేచురల్ స్టార్ నానితో నటించబోతున్నారు. కథా చర్చల్లో ఉన్న ఈ రెండు చిత్రాల వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. ప్రస్తుతం ఓ మల్టి స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు వెంకీ. తన మేనల్లుడు నాగచైతన్యతో వెంకీమామ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. త్వరలో నానితో కలిసి వెంకీ ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు తాజా సమాచారం. కాగా…బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి మల్టిdస్టారర్‌కు సిద్ధమవుతున్నారు వెంకీ. గతంలో విజయాలను రమ్మని పిలిచిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. మూడు దశాబ్దాల నట ప్రయాణంలో ఎన్నో విజయాలతో బాక్సాఫీస్ చరిత్రలు రాశారు. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నారు. హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించారు. నటుడిగా తన జీవితంలో ప్రతి దశకు అనుగుణంగా మారుకుంటూ వచ్చారు వెంకీ.

No comments:
Post a Comment