నటిగా మరింత ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది బాలీవుడ్ మోడల్, నాయిక తారా శర్మ. ఎక్కువగా వ్యాపార ప్రకటనల్లో కనిపించే తారా శర్మ….నటిగా, నిర్మాతగా కూడా పేరు తెచ్చుకుంది. తారా శర్మ షో అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మోడల్‌గా రాణించాక మిగతా అమ్మాయిల్లాగే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఓం జై జగదీష్ ఆమె నటించిన తొలి చిత్రం. ఆ తర్వాత ఖోస్లా కా ఘోస్లా, మస్తీ, పేజ్ 3 చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 10 ఎంఎల్ లవ్ తారా శర్మకు మరింత పేరు తీసుకొచ్చింది. ఇలా తనకు అవకాశాలు, గుర్తింపు దక్కినా మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటోందీ భామ. ప్రస్తుతం తాను చేస్తున్న కార్యక్రమం తారా శర్మ షో ను కొంతకాలం ఆపేసి సినిమాల సంఖ్యను పెంచుకుంటానని చెబుతోంది. ఆమె మాట్లాడుతూ నా కార్యక్రమంతో విసిగిపోయాను. మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. సినిమా తగ్గితే నా ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. నాకు పాత్ర నిడివితో అవసరం లేదు. ఆ పాత్ర కథలో ఎంత కీలకంగా ఉంది అనేది చూస్తానని చెప్పాను. ఒక మంచి పాత్రలో నటించాలని అనుకుంటాను. మరో చిత్రంలో పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా నటిగా మెరుగవ్వాలని కోరుకుంటున్నాను. అని చెప్పింది.
No comments:
Post a Comment