విజయవాడ న్యూస్‌టుడే:
వైసీపీ అభ్యర్ధుల ఎంపికను వేగవంతం చేసింది..
రెండు మూడు రోజుల్లో ఈ కసరత్తు మొత్తాన్ని పూర్తి చేసి అభ్యర్దులను ప్రకటించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.. ఇక విజయవాడ లోక్ సభ స్థానానికి ప్రముఖ వ్యాపార వేత్త పొట్లూరి వర ప్రసాద్ – పీవీపీ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఆయనకు స్పష్టమైన హామీ లభించనట్లు పార్టీ వర్గాల బోగట్టా.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని పీవీపీ భావించారు.. ఈ మేరకు పీవీపీకి అత్యంత సన్నిహితుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో మాట్లాడినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.. విజయవాడ కాకుండా మరెక్కడైన ఇస్తానని చంద్రబాబు అన్నప్పటికీ పీవీపీ సుముఖత వ్యక్తం చేయలేదు. తాజాగా వైసీపీలో చేరిన పీవీపీ విజయవాడ స్థానం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
No comments:
Post a Comment