Thursday, March 21, 2019

రేపే ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ ఈవెంట్..


నిహారిక ప్రధాన పాత్రధారిగా ప్రణీత్ దర్శకత్వంలో ‘సూర్యకాంతం’ సినిమా నిర్మితమైంది. సృజన్ .. సందీప్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
రేపు (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ ఈ వేడుకకి వేదికగా మారనుంది. గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరుకానున్నాడు. ఇంతవరకూ నిహారిక చేసిన సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ సినిమా మాత్రం తన క్రేజ్ ను మరింతగా పెంచుతుందని ఆమె భావిస్తోంది. ఆమె నమ్మకం నిజమవుతుందేమో చూడాలి మరి. 

No comments:

Post a Comment