ఒంగోలు , న్యూస్‌టుడే:
అదొక స్వచ్ఛంద సేవా సంస్థ… దివ్యాంగులకు సేవ చేయాలన్న సదుద్దేశంతోనే ఉచిత వసతితో పాటు భోజన వసతి కల్పిస్తోంది. వారి సేవా నిరతికి ప్రభుత్వం సైతం మెచ్చి ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే అక్కడ ఉండే దివ్యాంగులు పడుతున్న అవస్థలు బయటపడ్డాయిమదర్ థెరిసా అంధుల ప్రత్యేక పాఠశాలలో ప్రాంతీయ విజిలెన్స్ అధికారిణి ఎం.రజని ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 55 మంది విద్యార్థులు ఉన్నట్లు నిర్వాహకులు రికార్డు చేసి పెట్టారు. అధికారులు తనిఖీలు చేసిన సమయంలో అక్కడి కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో చిన్నపిల్లలను నుంచి డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు సైతం ఉన్నారు. అయితే ఆడా, మగా అనే తేడా లేకుండా వీరందరినీ ఒకే గదిలో ఉంచారు. 10/10, 7/7 వైశాల్యం కలిగిన గదుల్లో పరుపులు, ఇతరత్రా వసతులేమీ కల్పించకుండా దాన్నే వసతిగృహంగా భ్రమింపజేశారు. ఈ విషయంపై నిర్వాహకులను ప్రశ్నిస్తే వేరొకచోట మరో గదిని చూపారు. అక్కడ కూడా పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

No comments:
Post a Comment