ఒంగోలు న్యూస్‌టుడే:
విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోసగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ ఉద్బోధించారు. . నల్లధనం వెనక్కు తీస్తానని ప్రకటించిన మోదీ నల్ల కుబేరులకు దోచి పెట్టారని ఆరోపించారు. విదేశీ విశ్వ విద్యాలయాల పేరుతో స్వదేశీ విశ్వ విద్యాలయాలను ధ్వంసం చేసి విద్యా రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువతను మోసగించారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం మాయ చేసిందన్నారు. విద్యా రంగంపై రాజకీయ పార్టీలు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, ఎం.సునీల్, సహాయ కార్యదర్శి ఎం.వినోద్, ఎస్.కిరణ్‌కుమార్, తదితరులుపాల్గొన్నారు.

No comments:
Post a Comment