Saturday, March 16, 2019

జ్వరాల బారిన గ్రామస్థులు……

ప్రకాశం న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…..
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ ….
2.పీడిస్తున్న జ్వరాలు …..
3. పడకేసిన  అన్నవరం ……
పొదిలి మండంలోని అన్నవరం గ్రామంలో జ్వరాలు ప్రబలి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత పదిరోజుల నుంచి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటికే దాదాపు 15 మంది విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు పొదిలి పట్టణంలో వైద్య సహాయం పొందుతున్నారు. కాలానుగుణ వ్యాధుల్లో భాగంగా జ్వరాలు ప్రబలున్నాయని, ఆరోగ్య సిబ్బంది చికిత్సలు అందిస్తున్నా దోమల తీవ్రత వల్ల సమస్య అధికంగా ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడంతో జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలో కాలువలు పూడుకుపోయి దోమల సమస్య తీవ్రమైంది. యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
                                                                                                

No comments:

Post a Comment