తిరుపతి న్యూస్‌టుడే:
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం…
- 9 వ తరగతి చదువుతున్న విద్యార్ధి మృతి…
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థి బలైన ఘటన పుంగనూరు మండలం కాపాడమిట్టపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఇంటిపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి 9 వ తరగతి చదువుతున్న విద్యార్ధి గణేష్ (14) మృతి చెందాడు. స్థానికులు మాట్లాడుతూ.. గణేష్ మృతికి విద్యుత్ అధికారులే కారణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగల్ని తొలగించాలంటూ.. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నప్పటకీ విద్యుత్ అధికారులు కరెంట్ వైర్లను తొలగించలేదని ఆరోపించారు.
No comments:
Post a Comment