న్యుస్‌టుడే:
* రాష్ట్రంలోనే అగ్రస్థానంలో కృష్ణా జిల్లాను నిలిపాం 16 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో గెలవాలి..
కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రగతిని చూసి ఓటేయాలని కోరారు. విజయవాడలోని కానూరు వి.ఆర్.సిద్ధార్థ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, సీబీఎన్ ఆర్మీ పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. జిల్లాలోని 16 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సూచించారు. కృష్ణా జిల్లాలో జరిగిన ప్రగతిని తెలియజేసి.. ప్రజల్లో చైతన్యం తెవాలన్నారు. తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపామన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తెచ్ఛి. తాగు, సాగు నీటిని పుష్కలంగా అందించడంతో ఆర్థికంగా అభివృద్ధి సాధించారని చంద్రబాబు వెల్లడించారు. కృష్ణాలో.. గోదావరి జలాలు తాగే ప్రతి ఒక్కరికీ సైకిల్‌కు ఓటేయాల్సిన బాధ్యత ఉందన్నారు. పట్టిసీమతో పాటూ వైకుంఠపురం నిర్మాణం చేపడుతున్నామని, పోలవరం పూర్తవుతోందని.. ఈ రెండూ పూర్తయితే ఇంక నీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితే ఉండదన్నారు. ప్రతి ఎకరాకూ పుష్కలంగా నీటిని అందిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment