Friday, March 15, 2019

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు శుభవార్త…..

హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మధ్య వచ్చేవారం నుంచి మెట్రో రైలు కూత పెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కారిడార్‌లో పనులు గత నవంబరు నాటికే పూర్తి కాగా, తాజాగా రైళ్లు నడిపేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment