శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2. ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన జనం .
3.దర్శించుకుంటున్న భీమవరం రాజవంశీకులు.
వమరవల్లి శ్రీఎల్లమ్మతల్లి జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఈ జాతర మూడురోజుల పాటు నిర్వహించాల్సి ఉన్నా మొదటిరోజు యాత్రికులతో వమరవల్లి వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ జాతర మహోత్సవం ఏటా మాఘమాసం చివరి వారంలో నిర్వహించడం ఆనవాయితీ. జాతరలో భాగంగా నిర్వాహకులు వేకువజామున ఎల్లమ్మతల్లి తిరువీధి నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకొన్న యాత్రికులు మూడు రోజులు పాటు విడిది చేసి మొక్కులు చెల్లించుకుంటారు. జి.ఎ.రెడ్డి మెమోరియల్ ట్రష్ట్ యజమాని గంట హరహరరెడ్డి యాత్రికల సౌకర్యార్థం అన్నదానం నిర్వహించారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామానికి చెందిన యువకుల సేవాదళ్‌గా ఏర్పడి పహారా నిర్వహించారు.

No comments:
Post a Comment