గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
*రెండో జాబితాలో రామాంజనేయులకు టిక్కెట్ ఖరారు…
కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నుంచి గుంటూరు జిల్లా పూర్వ కలెక్టర్ బి. రామాంజనేయులు తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ మాజీ ఐఏఎస్ అధికారికి సీటు కేటాయించింది. అధిష్టానం ప్రకటించిన రెండో జాబితాలో రామాంజనేయులకు టిక్కెట్ ఖరారు చేశారు. ఆయన తాడికొండ, ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాలు, బాపట్ల, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి ఎక్కడైనా పోటీచేసేందుకు యత్నించారు. అయితే, టీడీపీ అధిష్టానం రామాంజనేయులు సొంత జిల్లా కర్నూలులోని కోడుమూరు అసెంబ్లీ టిక్కెట్‌ను ఖరారు చేసింది. సీ ఎం చంద్రబాబు మంగళవారం కర్నూలు ఎన్నికల సభలో రామాంజనేయులను పరిచయం చేశారు.
No comments:
Post a Comment