Wednesday, March 20, 2019

మాదిగ జాతిని అనాథను చేశారు…….


చిత్తూరు పిచ్చాటూరు, న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
*మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ..
నా మాదిగ జాతిని ఎవరికీ పట్టని విధంగా పాలక, ప్రతిపక్ష పార్టీలు అనాథగా మార్చాయి’అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. స్థానిక టీబీడీఆర్‌ కల్యాణ మండపంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు మునిరాజు ఆధ్వర్యంలో మంగళవారం మాదిగల విశ్వరూప సన్నాహక సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మందకృష్ణమాదిగ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖలు ఇచ్చి తీర్మానం చేసిన తెదేపా, కాంగ్రెస్, భాజపా, వైకాపాతోపాటు ఇతర పార్టీలు విభజన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక అన్ని పార్టీలు మాట మార్చాయని విమర్శించారు చట్టసభల్లో మాదిగల ఉనికే లేకుండా చేయాలని తెదేపా, వైకాపా పార్టీలు కుట్రలుపన్ని 29 ఎస్సీ అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలు మాలలకే కేటాయించారని, నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ అన్యాయం చేశారని తెలిపారు. మాదిగజాతి హక్కుల కోసం ఈనెల 30న అమరావతిలో జరిగే విశ్వరూప మహాసభకు ప్రతిఒక్కరూ తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ, నాయకులు బి.గోపి, వెంకటస్వామి, దేవరాజు, శంకరప్ప, జిల్లా నాయకులు కుమారస్వామి, కార్తీక్, నాయకులు మాతయ్య, దేవేంద్ర, వెంకటేష్, రామ్‌రాజ్, ప్రభాకర్, మురళీ, రామయ్య, సురేష్, దిలీప్, వెంకట్రాద్రి మాదిగ పాల్గొన్నారు.

No comments:

Post a Comment