కడప న్యూస్‌టుడే:కడప జిల్లా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కందుల ఎస్టే సభాభవనంలో మార్చి 8వ తేదీ ఉదయం10గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆపస్ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ.. కుటుంబ, సమాజ, దేశ అభివృద్ధికి మహిళల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధన కోసం ఈ ఉత్సవం తోడ్పడుతోందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రామమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు పదోన్నతులు వెంటనే కల్పించాలని, స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లను పదవీ విరమణ పొందిన వారికి వర్తింపజేయాలని, ఆర్థిక లాభాన్ని ఉత్తర్వుల అమలు తేదీ నుంచి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, జిల్లా సహాధ్యక్షులు నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శులు శ్రీపతికుమార్‌రెడ్డి, రెడ్డెయ్యరెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment