అనకాపల్లి, విశాఖ న్యూస్‌టుడే:
*అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉల్లాసంగా నిర్వహించారు…
*ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కొల్లూరి పూర్ణిమ మాట్లాడుతూ కుటుంబంలో మహిళల పాత్ర చాలా కీలకమైందని, వారు లేనిదే మనుగడ లేదని అన్నారు…
పట్టణంలోని ఉప్పల చంద్రశేఖర్ కల్యాణ మండపంలో బుధవారం వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉల్లాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కొల్లూరి పూర్ణిమ మాట్లాడుతూ కుటుంబంలో మహిళల పాత్ర చాలా కీలకమైందని, వారు లేనిదే మనుగడ లేదని అన్నారు. ఇతిహాసాలు నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం అనేది మన దేశానికే గర్వకారణం అన్నారు. ఈ వేడుకలకు జిల్లాలో వాసవీ వనితా క్లబ్‌ల నుంచి 400 మంది సభ్యులు పాల్గొన్నారు. నాట్యాచారిణి భాగవతుల శిరీషారాణి శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. క్లబ్ సభ్యులకు పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. క్లబ్ దత్తత తీసుకున్న మూలపేట ప్రాథమిక పాఠశాలకు బీరువాను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి తమ్మిన సౌందర్య, కోశాధికారి కాంతి, సభ్యులు జీవీ.సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment