Wednesday, March 13, 2019

జాతీయ రహదారిలోఇద్దరికి ప్రమాదం….


సంతమాగులూరు, న్యూస్‌టుడే:
  • అమరావతి- అనంతపురం జాతీయ రహదారిలో వెల్లలచెరువు వద్ద బుధవారం చోటుచేసుకున్న రహదారి ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 
  • వెల్లలచెరువు పెట్రోలు పంపు సమీపంలోకి రాగానే వినుకొండ వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి దిచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
ప్రమాదంలో బాబు, శ్రీనివాసరావులకు తీవ్ర గాయాలయ్యాయి. . సమాచారం అందిన వెంటనే నామ్‌ అంబులెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో రావి బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

No comments:

Post a Comment